అబ్బే ఏమంత బాగాలేదు: ఇవాంకా గ్రీన్ డ్రస్ పై ఫారిన్ మీడియా ఎద్దేవా!

  • ఆకుపచ్చని దుస్తుల్లో జీఈఎస్ లో పాల్గొన్న ఇవాంకా
  • డ్రస్, షూస్ మ్యాచ్ కాలేదని కామెంట్లు
  • ఉదయం పూట డ్రస్ బాగుందని కితాబు
"ఏంటిది ఆకుపచ్చ దుస్తులకు మ్యాచింగ్ నల్లని చెప్పులా?", "ఆకుపచ్చ రంగు బాగున్నా, పసుపు, గులాబీ పూలు డ్రస్ అందాన్ని చెడగొట్టాయి", "మెడను పూర్తిగా కప్పి ఉంచేలా నెక్‌, ఛాతి వద్ద ఉన్న రంధ్రం ఏమాత్రం బాగోలేదు"... ఇవి నిన్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఇవాంకా వేసుకు వచ్చిన దుస్తులపై విదేశీ మీడియా కామెంట్లు.

ఉదయం హైదరాబాద్ లో దిగిన సమయంలో తెల్లటి ముత్యాలు కలిగిన నల్లని కోటు ధరించి, భారతీయత ఉట్టిపడేలా కనిపించిన ఆమె, సాయంత్రం ఏ మాత్రం హుందాగా లేని దుస్తులతో వచ్చారని, ఆకుపచ్చ రంగుతో సిల్క్ క్లాత్ బాగున్నా, పూలతో సహజత్వం పోయిందని మీడియా పేర్కొంది. ఇవాంకా అవగాహనా లేమితోనే దుస్తులను, చెప్పులను ఎంచుకున్నట్టు కనిపిస్తోందని, ఇక ఈ గౌన్ ఎక్కువకాలం గుర్తుండే అవకాశాలు లేవని పలు మీడియా సంస్థలు అభిప్రాయపడ్డాయి.
Go Back to Shorts
ivanka trump
green dress
GES 2017

More Telugu News